: రాత్రి 8 దాటితే ఆశారాం పక్కన పడతి ఉండాల్సిందే!


నేను 'అమ్మాయ'కుడను అంటూ చేసిన తప్పును సమాధి చేద్దామనుకున్న ఆధ్యాత్మికవేత్త ఆశారాం బాపు మాటలు పచ్చి అబద్దాలని తెలుస్తోంది. ఆశారాం బాపుకు వ్యక్తిగత సహాయకుడిగా ఉన్న శివ నివ్వెరపోయే నిజాలను పోలీసుల ముందు బయటపెడుతున్నాడు. రాత్రి 8 గంటలు దాటితే ఆశారాం మహిళతో గడపాల్సిందేనని చెప్పాడు. ఆశారాం బాపు ఆయుర్వేద విభాగంలో వైద్యుడిగా గతంలో పనిచేసిన ప్రజాపతి కూడా అచ్చం ఇలానే చెప్పారు.'ఆశారాం తీవ్ర అస్వస్థతతో ఉన్నారని రాత్రి వేళ వెళ్లాను. గార్డులకు నేను తెలుసు గనుక నేరుగా ఆశారాం గదికి వెళ్లిపోయాను. ఆ సమయంలో ఆశారాం 25 ఏళ్ల యువతితో అసభ్యకరమైన స్థితిలో ఉన్నారు' అంటూ ప్రజాపతి చెప్పారు. ఇప్పుడు ఇవన్నీ అత్యాచార కేసులో ఇరుక్కున్న ఆశారాంకు ప్రతికూలం కానున్నాయి. గతనెల 15న జోధ్ పూర్ లోని ఆశ్రమంలో 16 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసినట్లు ఆశారాంపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News