: పార్లమెంటు సమావేశాలు పొడిగించే యోచన
పార్లమెంటు సమావేశాలను మరింత పొడిగించే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజనపై ఎంపీల ఆందోళనలతో హోరెత్తిన పార్లమెంటు ఎన్నోమార్లు వాయిదా పడడంతో విలువైన సమయం వృథా అయింది. అంతేగాకుండా.. బొగ్గు దస్త్రాలపై ఆందోళనలతో పలుసార్లు.. పాకిస్తాన్, చైనాలు చేస్తున్న దురాగతాలపై ఆందోళనలతో మరికొన్నిసార్లు ఉభయసభలు వాయిదా పడ్డాయి. దీంతో పలు బిల్లులు పెండింగ్ లో పడిపోయాయి. అందుచేత మరికొన్ని రోజులు పార్లమెంటు సమావేశాలు పొడిగించి వాటిని ఆమోదింపజేసే ఆలోచనలో కేంద్రం ఉంది. దీంతో పార్లమెంటు సమావేశాలు మరిన్ని రోజులు కొనసాగనున్నాయి.