: ఐదేళ్ల బుడతడు.. విమానంలో ఎగిరిపోయాడు
ఐదేళ్ల వయసుకు అడుగులే సరిగా పడవు కొందరు చిన్నారులకు! కానీ, ఈ చైనా బాలుడు మాత్రం ఐదేళ్లకే విమానాన్ని నడిపి చరిత్ర సృష్టించాడు. డ్యూడో అనే ఈ బుడతడు పోయిన శనివారం బీజింగ్ వైల్డ్ లైఫ్ జూ సమీపంలో చిన్న విమానంలో ఎక్కి నింగిలో 30 కిలోమీటర్ల దూరంపాటు ప్రయాణించాడు. కేవలం 20 రోజుల శిక్షణ తీసుకుని విమానాన్ని నడపడం విశేషం. డ్యూడో ప్రయత్నాన్ని అతడి తండ్రి వీడియోతీశాడు. వాటిని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారికి పంపుతున్నాడు.