: నిమ్స్ నుంచి నేడు జగన్ డిశ్చార్జి
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు నిమ్స్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవనున్నారు. ఈ మేరకు నిమ్స్ వైద్యులు వివరాలు వెల్లడించారు. గత ఐదు రోజుల నుంచి ఇక్కడ చికిత్స తీసుకుంటున్న ఆయన పూర్తిగా కోలుకున్నట్టు వారు ప్రకటించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా చంచల్ గూడ జైల్లోనే దీక్ష చేపట్టిన జగన్ ను కొన్ని రోజుల కిందట పోలీసులు ఉస్మానియాకు తరలించారు. అక్కడి నుంచి నిమ్స్ కు తరలించారు. అక్కడ కూడా దీక్ష కొనసాగడంతో ఆరోగ్య పరిస్థితి విషమించింది. దాంతో, వైద్యుల సాయంతో దీక్షను భగ్నం చేశారు.