: సంతానోత్పత్తిలో ఇదో కొత్త విధానం


సంతానం లేదని దిగులు చెందాల్సిన పనిలేకుండా కృత్రిమ గర్భధారణకు అవకాశాన్ని కల్పిస్తున్నారు శాస్త్రవేత్తలు. అయితే అసలు పూర్తిగా సంతాన సామర్ధ్యాన్ని కోల్పోయిన ఒక మహిళకు అండాశయంలో కణజాలాన్ని మార్చడం ద్వారా ఆమె గర్భం ధరించేలా అవకాశాన్ని కల్పించి ఆస్ట్రేలియా వైద్యులు ఒక కొత్త అధ్యాయానికి తెరతీశారు.

ఆస్ట్రేలియాకు చెందిన వలి అనే మహిళ కేన్సర్‌ బాధితురాలు. ఆ వ్యాధికి ఆమె చికిత్స తీసుకునే సమయంలో ఆండాశయ కణజాలం దెబ్బతినకుండా వైద్యులు ఆమె అండాశయ కణజాలాన్ని తొలగించి భద్రపరిచారు. ఏడేళ్ల తర్వాత ఆమె కేన్సర్‌ బారినుండి పూర్తిగా విముక్తురాలైన తర్వాత ఆమెనుండి గతంలో సేకరించి భద్రపరచిన అండాశయ కణజాలాన్ని తిరిగి ఆమె పొట్టలో శస్త్రచికిత్స ద్వారా అమర్చారు. కొన్ని నెలల వ్యవధిలోనే కణజాలం పనిచేయడం ప్రారంభించింది. తర్వాత కొన్ని హార్మోన్లను ప్రవేశపెట్టి ఆ కణజాలం నుండి రెండు అండాలను ఉత్పత్తి చేయగలిగారు. వాటిని బయటికి తీసుకుని ఫలదీకరణం చేసి తిరిగి వలి గర్భాశయంలో ప్రవేశపెట్టారు.

ఇప్పుడు ఆమె 26 వారాల గర్భవతి. కవల పిల్లలకు వలి జన్మనివ్వనున్నారు. సాధారణంగా అండాశయ కణజాలాన్ని ప్రవేశపెట్టి సంతానోత్పత్తి సామర్ధ్యాన్ని కల్పించడం అనేది కొత్త విధానం కాదని, ఈ విధానం ద్వారా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 30 మంది మహిళలు తల్లులు అయ్యారని, అయితే అండాశయ కణజాలాన్ని పొట్టలో ప్రవేశపెట్టి అక్కడ వృద్ధి చేయడం అనేది మాత్రం ప్రపంచంలోనే ఇదే తొలిసారని వలికి చికిత్స చేసిన వైద్య నిపుణులు కేట్‌ స్టెర్న్‌ చెబుతున్నారు.

  • Loading...

More Telugu News