: ఏపీ ఎన్జీవోల సభకు షరతులతో కూడిన అనుమతి
ఏపీ ఎన్జీవోల ప్రయత్నం ఫలించింది. ఈ నెల 7న హైదరాబాదులో బహిరంగ సభ నిర్వహించుకుని, తమ వాదాన్ని వినిపించుకోవాలన్న వారి కోరిక నెరవేరుతోంది. ఇందుకు సంబంధించి నగర పోలీస్ కమీషనర్ షరతులతో కూడిన అనుమతిని ఇంతకు క్రితమే మంజూరు చేశారు. ఆ రోజు ఎల్బీ స్టేడియంలో జరిగే సభలో కేవలం ఎన్జీవోలు మాత్రమే పాల్గొనాలని పోలీసులు షరతు విధించారు. సభకు హారయ్యేవారు తమ ఐడీ కార్డులు తీసుకురావాలని తెలిపారు. ఆ రోజు సాయంకాలం 2 గంటల నుంచి 5 గంటల వరకు మాత్రమే సభను నిర్వహించుకోవాలని పోలీసులో తమ అనుమతి ఉత్తర్వులలో పేర్కొన్నారు.