: తెలుగువాళ్ళకు అనుమతినివ్వరా?: సోమిరెడ్డి
ఏపీఎన్జీవోలు ఈనెల 7న హైదరాబాదులో తలపెట్టిన భారీ బహిరంగ సభకు అనుమతినివ్వకపోవడం దారుణమన్నారు టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. రాజధానిలో సభ పెట్టుకునే హక్కు తెలుగువాళ్ళకు లేదా? అని సోమిరెడ్డి ప్రశ్నించారు. ఇది పక్షపాతమేనన్నారు. ఏపీఎన్జీవోల సభకు టీడీపీ మద్దతిస్తుందని ఆయన తెలిపారు. ఇక, కేంద్ర హోం మంత్రి షిండే రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నాడని ఆరోపించారు. సీమాంధ్రలో ఉద్యమజ్వాలలు ఉవ్వెత్తున ఎగసిపడుతుంటే, 20 రోజుల్లో తెలంగాణ నోట్ ను క్యాబినెట్ ముందుంచుతామని షిండే ప్రకటించడం ఆయన నిరంకుశ వైఖరికి ినిదర్శనమని సోమిరెడ్డి అన్నారు.