: చంద్రబాబు వ్యాఖ్యలకు కౌంటర్ పడింది!
గుంటూరు జిల్లాలో బస్సుయాత్ర సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. పెదకూరపాడు నియోజకవర్గంలోని ఊటుకూరులో మాట్లాడుతూ బాబు.. రాహుల్ ఓ మొద్దబ్బాయని, పప్పుసుద్ధని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఢిల్లీలో స్పందించారు. రాహుల్ పప్పు సుద్ధ అయితే, నారా లోకేశ్ పందికొక్కా? అని ప్రశ్నించారు. ఇక, లోక్ సభలో టీడీపీ ఎంపీలు బూతుపురాణానికి తెరదీస్తున్నారని, వాళ్ళ ప్రవర్తనపై బాబు తక్షణమే క్షమాపణ చెప్పాలని గుత్తా డిమాండ్ చేశారు.