: మంత్రి దానం నివాసం బయట పోస్టర్ల కలకలం
హైదరాబాద్ బంజారాహిల్స్ లోని మంత్రి దానం నాగేందర్ నివాసం బయట గోడకు అంటించిన పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. 'హైదరాబాద్ యూటీ అంటే విప్లవమే' అంటూ పోస్టర్లపై వ్యాఖ్యలు ఉండగా దానం ఫోటో కూడా ఉంది. అయితే, వాటిని ఎవరు అంటించారనే దానిపై ఎలాంటి వివరాలు తెలియలేదు.