: దాచాల్సిన అవసరం లేదు: ప్రధాని
బొగ్గు కుంభకోణంలో గల్లంతైన ఫైళ్ళపై ప్రధాని స్పందించారు. రాజ్యసభలో ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ, ప్రభుత్వానికి ఏదీ దాచాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. గల్లంతైన ఫైళ్ళను సీబీఐకి అందజేసేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. సీబీఐ విచారణకు ప్రభుత్వం సహాయం అందిస్తుందని అన్నారు. దర్యాప్తు బృందాలకు ఇప్పటికే లక్ష ఫైళ్ళను అందజేసినట్టు ఆయన వెల్లడించారు. ఇక, అసంబద్ద ఆరోపణలు తగవని విపక్షాలకు ప్రధాని హితవు పలికారు. ఫైళ్ళ గల్లంతుపై ఇప్పుడే ఏమీ సమాధానం చెప్పలేమని ఆయన బదులిచ్చారు. దీంతో ప్రధాని సమాధానంపై ప్రతిపక్షాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. దీంతో రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదాపడింది.