: యూటీగా హైదరాబాద్: హోం శాఖ పరిశీలన


ఆంధ్రప్రదేశ్ విభజనపై కేంద్రం మల్లగుల్లాలు పడుతోంది. రాష్ట్ర విభజనకు ప్రధాన అడ్డంకిగా మారిన 'హైదరాబాద్'పై తర్జనభర్జనలు సాగుతున్నాయని జాతీయ వార్తాపత్రికలు కోడైకూస్తున్నాయి. విభజనకు ప్రతిబంధకంగా మారిన 'హైదరాబాద్' విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బావుంటుందని కాంగ్రెస్ అధిష్ఠానం తీవ్ర ఆలోచనల్లో మునిగిపోయింది. 'విడవమంటే పాముకి కోపం.. కరవమంటే కప్పకు కోపం' అన్నట్టు ఉంది తాజా పరిస్థితి. దీంతో, కాంగ్రెస్ పార్టీకి ముందు నుయ్యి(సీమాంధ్ర) వెనుక గొయ్యి(తెలంగాణ) అన్నట్టు తయారైంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ను యూటీగా చేస్తే సమస్యలకు సగం పరిష్కారం లభించినట్టేనన్న భావనలో ఉన్నట్టు ఆ వార్తాసంస్థలు చెబుతున్నాయి. అందులో భాగంగా హైదరాబాదును యూటీ చేయాలని కేంద్రానికి హోంశాఖ సూచించే అవకాశముంది.

  • Loading...

More Telugu News