: 9,500 కి వివాహితను అమ్మేసిన ఆటోడ్రైవర్


ప్రేమిస్తున్నానని, బాగా చూసుకుంటానని మాయమాటలు చెప్పి ఓ వివాహితను లోబరుచుకున్న ఆటో డ్రైవర్ ఆమెను రూ. 9,500లకు అమ్మేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఘట్ కేసర్ మండలంలో రాజీవ్ గృహకల్పలో నివాసముండే వివాహితకు అక్కడే ఉండే శ్రీను అనే ఆటోడ్రైవర్ వలపు వలవేశాడు. పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని, ఏ లోటూ రానివ్వనని ఊహల్లో స్వర్గాన్ని చూపించాడు. దీంతో గత నెల 7 న ఆమెను మేడిపల్లికి తీసుకువెళ్లి అంతకు ముందే పరిచయమున్న అనురాధ, సంతోషిలకు అమ్మేశాడు. దీంతో ఆమెను వారు 9వ తేదీన వైజాగ్ తీసుకెళ్లారు. అక్కడికి మరో రెండురోజుల్లో వచ్చేస్తానని శ్రీను ఆమెకు ఫోన్లో నచ్చజెప్పాడు.

అనంతరం, ఆమెను వ్యభిచారం చేయాలని సంతోషి, అనురాధ ఒత్తిడి చేయడంతో ఆమె వారికి ఎదురుతిరిగింది. దీంతో వారు 9,500 రూపాయలు పోసి ఆమెను కొన్నామని, తాము చెప్పినట్టు నడుచుకోవాలని చెప్పడంతో కంగుతిన్న ఆమె ఆ డబ్బులు ఇప్పిస్తానని, తనను వదిలేయాలని వేడుకొంది. దీంతో తన బంధువులతో వారికి హామీ కూడా ఇప్పించింది. డబ్బులు పంపేందుకు అకౌంట్ నంబర్ పంపడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అకౌంట్ నంబర్ ఆధారంగా బాధితురాలికి విముక్తి కల్పించి నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మోసగాడు శ్రీనుతో పాటు మేడిపల్లిలో ఉంటున్న అనురాధ, సంతోషిలు ఇల్లు ఖాళీ చేస్తున్నారన్న సమాచారంతో వారిని పట్టుకుని రిమాండుకు తరలించారు.

  • Loading...

More Telugu News