: లోక్ సభలో హోరెత్తిన 'సందీప్ దీక్షిత్ డౌన్ డౌన్' నినాదాలు
లోక్ సభ ప్రారంభమవుతూనే విపక్ష నినాదాలతో దద్దరిల్లింది. టీడీపీ ఎంపీ శివప్రసాద్ ను అసభ్య పదజాలంతో దూషించిన సందీప్ దీక్షిత్ డౌన్ డౌన్ అంటూ విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. సందీప్ దీక్షిత్ పై టీడీపీ పార్లమెంటరీ నేత నామా ఇచ్చిన సభాహక్కుల ఉల్లంఘన నోటీసు అందిందని స్పీకర్ సభలో వెల్లడించారు. అలాగే సీమాంధ్ర టీడీపీ ఎంపీలపై టీ కాంగ్ ఎంపీలు పొన్నం ప్రభాకర్, మధుయాష్కి తదితరులు ఇచ్చిన నోటీసు కూడా అందినట్టు స్పీకర్ తెలిపారు. సమావేశాలు ముగుస్తున్నా బొగ్గు కుంభకోణంపై చర్చ చేపట్టలేదని బీజేపీ నేత సుష్మాస్వరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో, ఆ పార్టీ నేతలు ఆందోళన చేశారు. బొగ్గు కుంభకోణంలో దస్త్రాల గల్లంతుపై ప్రధాని సమాధానం చెప్పాలని సుష్మాస్వరాజ్ డిమాండ్ చేశారు.