: ఫోటో జర్నలిస్టు అత్యాచార నిందితులపై మరో మహిళ ఫిర్యాదు


గతనెల ముంబయిలో మహిళా ఫోటో జర్నలిస్టుపై అత్యాచార ఘటనలో అరెస్టైన ఐదుగురు నిందితుల్లో ముగ్గురు తనపైన అత్యాచారానికి పాల్పడ్డారని ఓ మహిళ తాజా ఆరోపణలు చేసింది. జులై 31న శక్తి మిల్స్ కాంపౌండ్ లో ఆ ఘటన జరిగినట్లు చెప్పింది. జర్నలిస్టు కేసులో నిందితులు అరెస్టైన అనంతరం విడుదలచేసిన ఫోటోల ఆధారంగా వారిని గుర్తుపట్టానని తెలిపింది. గతంలో వారిపై తాను కేసు దాఖలు చేశానంది. ముంబయిలోని బందూప్ పోలీస్ స్టేషన్ లో నమోదైన ఆ కేసు ప్రస్తుతం క్రైం బ్రాంచ్ కు బదలాయించారు.

  • Loading...

More Telugu News