: పోలీసులను ఏమార్చి రిమాండ్ ఖైదీ పరారీ
ఖైదీలు పరారవుతున్న ఘటనలు తరచూ చూస్తున్నాం. కర్ణాటకలో ఓ ఖైదీ జైలు గోడదూకి పరారైన సంగతి తెలిసిందే. తాజాగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న లక్ష్మణరావును చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తీసుకువచ్చారు. తప్పించుకునేందుకు అదను చూసిన లక్ష్మణరావు చికిత్స పొందుతూ పోలీసులను ఏమార్చి పరారయ్యాడు. దీంతో, పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.