: సీమాంధ్ర ఉద్యోగులకు జీతాలు చెల్లించాలి: హరికృష్ణ
సమైక్యాంధ్రకు మద్దతుగా నెల రోజుల నుంచి సమ్మె చేస్తున్న సీమాంధ్ర ఉద్యోగులకు వెంటనే జీతాలు చెల్లించాలని టీడీపీ నేత హరికృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకుంటున్న సాధారణ ఉద్యోగులు నెల జీతాలు లేకుండా ఎలా బతుకుతారని ప్రశ్నించారు. సాధ్యమైనంత త్వరగా ఉద్యోగులకు జీతాలు చెల్లించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఉద్యోగులు చేస్తున్న ఆందోళనపై సర్కారు అనుసరిస్తున్న వైఖరిని ఈ సందర్భంగా హరికృష్ణ తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర రాజధానిలో ఈనెల 7న నిర్వహించనున్న సమైక్యాంధ్ర సభకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి తెలిపారు.