: లుసోఫోనియా గేమ్స్ మాకొద్దు: గోవా స్వాతంత్ర్య సమరయోధులు
అంతర్జాతీయ ఆదరణ కలిగిన ఆటలు ఏ వేదికగా జరిగినా ప్రజలు, అభిమానులు ఆదరిస్తారు. అయితే అందుకు విరుద్ధంగా గోవాలో స్వాతంత్ర్య సమరయోధులు లుసోఫోనియా గేమ్స్ తమ రాష్ట్రంలో జరపవద్దని హెచ్చరిస్తున్నారు. అప్పట్లో గోవా పోర్చుగీసు పాలిత ప్రాంతమన్న విషయం అందరికీ తెలిసిందే. పోర్చుగీసువారి ఆధిపత్యం కారణంగా ఇప్పటికీ గోవా ప్రజలు దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారని గోవా స్వాతంత్ర్య సమరయోధుల అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రకాంత్ కంక్రే అభిప్రాయపడ్డారు.
అందుకే పోర్చుగీసుకు సంబంధించిన లుసోఫోనియా గేమ్స్ ఇక్కడ ఎలా నిర్వహిస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు. 450 ఏళ్లు మేమే పాలించామంటూ వారు ఎగతాళి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ గేమ్స్ లో తమ రాష్ట్ర క్రీడాకారులు పాల్గొనకూడదని ఆయన ఒక విజ్ఞాపన పత్రాన్ని పంపారు. అయితే గోవా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు గురుదత్ భక్తా మాత్రం దీన్ని ఖండించారు. లుసోఫోనియా గేమ్స్ ను పోర్చుగీసు కామన్ వెల్త్ గేమ్స్ గా వ్యవహరించారు.