: సభ సాగనిస్తేనే తెలంగాణవాదులపై నమ్మకం కలుగుతుంది: ఏపీఎన్జీవో


సెప్టెంబర్ 7న హైదరాబాదులో తలపెట్టిన సమైక్యాంధ్ర సభను సజావుగా సాగనిస్తేనే తెలంగాణవాదులపై ప్రజల్లో నమ్మకం కలుగుతుందని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు అన్నారు. హైదరాబాదులోని ఏపీఎన్జీవో భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, సమైక్య సభను అన్ని వర్గాలు ఆదరించాలని అన్నారు. సభను ప్రశాంత వాతావరణంలో క్రమశిక్షణతో నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. సభకు ప్రభుత్వం అనుమతించాలని కోరారు. సభ సందర్భంగా చెదురుమదురు సంఘటనలు జరిగినా పెద్దవి చేయొద్దని సూచించారు.

  • Loading...

More Telugu News