: పవన్ బర్త్ డే.. సోదరి సేవా కార్యక్రమాలు


టాలీవుడ్ లో విలక్షణ ఇమేజి సొంతం చేసుకున్న హీరో పవన్ కల్యాణ్. నేడు ఆయన జన్మదినం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పవన్ సోదరి డాక్టర్ మాధవి హైదరాబాదులో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సుభిక్ష ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో డాక్టర్ మాధవి చేతుల మీదుగా చిన్నారులకు యూనిఫాంలు, వారి కుటుంబ సభ్యులకు బియ్యం, ఇతర నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి యువత అధ్యక్షుడు స్వామి నాయుడు, పవన్ కల్యాణ్ వీరాభిమాని సతీశ్ తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News