: కన్ను, చెవి ఆపరేషన్లు చేయిస్తాం రండి: రేవంత్ రెడ్డి


కాంగ్రెస్ నేతలపై టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తనదైనశైలిలో విమర్శలు గుప్పించారు. సీమాంధ్రలో జరుగుతున్న ప్రజా ఉద్యమాన్ని చూడకుండా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏం చెబుతున్నారో వినకుండా ఏకపక్ష విమర్శలకు దిగుతున్న కాంగ్రెస్ ఎంపీలు లగడపాటి రాజగోపాల్, అనంత వెంకట్రామిరెడ్డి, పొన్నం ప్రభాకర్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు, ఆ పార్టీ నేత కడియం శ్రీహరిలకు ఉచితంగా శస్త్ర చికిత్సలు చేయిస్తామని చెప్పారు. హైదరాబాదులో నేడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ,.. వారు చూపు, వినికిడి సమస్యలతో బాధపడుతున్నట్టుందని, అందుకే వారికి ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఉచిత కన్ను, చెవి ఆపరేషన్లు చేయిస్తామని వ్యంగ్యంగా అన్నారు. ఇక లగడపాటిని జోకర్, బ్రోకర్ అని అభివర్ణించారు.

  • Loading...

More Telugu News