: లక్ష మందితో 'ప్రకాశం ప్రజాగర్జన'
ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో సమైక్యాంధ్రకు మద్దతుగా లక్ష మందితో 'ప్రకాశం ప్రజాగర్జన' జరిగింది. ఒంగోలు మినీ స్టేడియంలో జరిగిన సభకు ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజలు, ప్రజా సంఘాల ప్రతినిధులు లక్ష మంది హాజరయ్యారు. జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో వృత్తి సంఘాలు, కళాకారుల ప్రదర్శనలు అందరినీ అలరించాయి. సమైక్యాంధ్ర నినాదాలతో ఒంగోలు హోరెత్తిపోయింది.