: సీఎంతో సీమాంధ్ర మంత్రుల సమావేశం
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో మంత్రులు శత్రుచర్ల విజయరామరాజు, కాసు కృష్ణారెడ్డి సమావేశమయ్యారు. తమ రాజీనామాలను ఆమోదించాలని వారు ముఖ్యమంత్రిని కోరారు. ఇందుకు సీఎం బదులిస్తూ.. తాను రాష్ట్రంలో జరుగుతున్న అంశాలను అధిష్ఠానానికి నివేదిస్తున్నానని, అవసరమైతే అందరం కలిసే సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామాలు చేద్దామని సూచించినట్టు సమాచారం. అయితే, ఇప్పుడే అంతిమ నిర్ణయం తీసుకోవడం సరికాదని మంత్రులకు ఆయన సర్దిచెప్పినట్టు సమాచారం.