: ఈనెల 9తో ముగియనున్న జగన్ కేసుల దర్యాప్తు


రెండు సంవత్సరాలుగా కొనసాగుతున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు దర్యాప్తు తుది దశకు చేరుకుంది. ఈ నెల 9న ఛార్జిషీటు ఇవ్వాలన్న సుప్రీంకోర్టు ఆదేశంతో దర్యాప్తును ఆ రోజుకల్లా ముగించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ పనులను వేగవంతం చేసింది. అందుకోసం మిగిలిన ఆరు అంశాల్లో దర్యాప్తును పూర్తిచేసి ఛార్జిషీటు దాఖలు చేయనుంది. ఇంతకుముందు కొన్ని ఛార్జిషీట్లు దాఖలు చేసిన సీబీఐ ఈ తుది ఛార్జిషీట్లలో ప్రధాన నిందితులుగా జగన్, శ్రీనివాసన్, పెన్నా ప్రతాప్ రెడ్డి పేర్లను పేర్కొననుందట. వీరితో పాటు మరో మంత్రి, ఇద్దరు ఐఏఎస్ ల పేర్లు ఉండనున్నట్టు తెలుస్తోంది. నాలుగు రోజుల కిందట లేపాక్షి నాలెడ్జ్ భూ కేటాయింపుల వ్యవహారంలో మంత్రి గీతారెడ్డిని సీబీఐ రెండు రోజుల పాటు ప్రశ్నించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News