: 'పది జిల్లాల తెలంగాణ' కోసం నేడు బీజేపీ దీక్ష
హైదరాబాద్ తో కూడిన పది జిల్లాల తెలంగాణ కోసం కరీంనగర్ లో బీజేపీ దీక్ష చేయనుందని ఆ పార్టీ సీనియర్ నేత విద్యాసాగర్ రావు తెలిపారు. సెప్టెంబర్ 2న నిజాం సైనికులు, రజాకార్లపై పరకాలలో కాల్పులను వ్యతిరేకిస్తూ, ఆనాటి పోరాట వీరులను స్మరించుకుంటూ కరీనంగర్, వరంగల్ జిల్లాలకు చెందిన పార్టీ కార్యకర్తలతో ఒక్కరోజు దీక్ష చేస్తున్నట్లు తెలిపారు.