: రాత్రి నిద్ర తగ్గుతోందా.. తస్మాత్ జాగ్రత్త!
రాత్రివేళల్లో అతి తక్కువ నిద్రపోయే వారిలో జ్ఞాపకశక్తి చాలా దారుణంగా దెబ్బతింటుందని కాలిపోర్నియా యూనివర్సిటీకి చెందిన శాన్ డియాగో అంటున్నారు. ఆయన నిర్వహించిన ఓ పరిశోధనలో రాత్రిళ్లు తక్కువ నిద్రపోయేవారు.. జ్ఞాపకశక్తి పరీక్షలు నిర్వహించినప్పుడు.. తమ మెదడులోని ఒక భాగాన్ని సరిగ్గా ఫోకస్ చేయలేకపోతున్నట్లు గుర్తించామని వెల్లడించారు.
స్లీప్ అనే పత్రికలో ప్రచురితం అయిన ఈ పరిశోధన వివరాల ప్రకారం.. ఇన్సోమ్నియాతో బాధపడుతున్న వ్యక్తులు రాత్రివేళ నిద్ర పట్టకుండా ఇబ్బంది పడడం మాత్రమే కాదు.. పగటిపూట జ్ఞాపకశక్తి విషయంలో ఆలస్యంగా స్పందించడం కూడా చేస్తుంటారని వెల్లడించింది. ఈ పరిశోధనలో తక్కువ నిద్రపోయే వారికి ఎమ్మారై స్కానింగ్లు తదితర పరీక్షలు జరిపి ఈ విషయాలను నిర్ధారించారు.