: ఇక సూదిమందు లేదు ... మాత్రలే!
ప్రతిరోజూ మందు తప్పనిసరిగా తీసుకోవాలంటే.. రోజూ సూదులు పొడిపించుకోవడం నరకసమానంగా అనిపిస్తుంది. అదే మాత్ర అయితే.. ఎంచక్కా మింగేస్తూ ఉండొచ్చు. ఇప్పుడు శాస్త్రవేత్తలు అదే పనిచేశారు. ఎయిడ్స్‌కు కారణం అయ్యే హెచ్‌ఐవీ వైరస్ నివారణ చికిత్సలో కీలకంగా వాడుతున్న రెండు మందులను మాత్ర రూపంలో తొలిసారిగా ఆవిష్కరించారు.
సాధారణంగా హెచ్‌ఐవీకి డెసిటాబైన్, జెమిక్టాబైన్ అనే మందుల్ని ఇంజెక్షన్ల ద్వారా ఇస్తుంటారు. కొన్నిసార్లు ఐవీ ద్వారా నేరుగా నరాల్లోకి ఎక్కిస్తుంటారు. వ్యాధి ముదిరిన కొన్ని సందర్భాల్లో రోగి ప్రతిరోజూ ఈ మందు తీసుకోవాల్సి వస్తుంది. రోజూ ఐవీ ఇంజెక్షన్ అనేది నిజంగానే బాధాకరం. అందుకోసం ఇప్పుడు వీటిని మాత్రలుగా తయారుచేశారు. హెచ్‌ఐవీ చికిత్స విషయంలో ఇది పెద్ద పురోగమనం కాగలదని వారు అంచనా వేస్తున్నారు.