: ముఖ్యమంత్రితో కృపారాణి, శైలజానాథ్ భేటీ
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, మంత్రి శైలజానాథ్ లు వేర్వేరుగా సమావేశమయ్యారు. సీమాంధ్రలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి, అక్కడి ప్రజల మనోభావాలపై అధిష్ఠానానికి ఉన్న సమాచారం వంటి అంశాలను చర్చించినట్టు తెలుస్తోంది. మాజీ మంత్రులు జేసీ దివాకర రెడ్డి, గాదె వెంకటరెడ్డి, ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ కూడా మఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.