: వాళ్లే తెలుసుకుని మానేస్తారు.. తెలంగాణ ఎర్పాటు తథ్యం: జానా, డీఎస్


సీమాంధ్రల్లో జరుగుతున్న ఉద్యమాల గురించి భయపడాల్సిన అవసరం లేదని మాజీ పీసీసీ అధ్యక్షుడు డీఎస్, మంత్రి జానా రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో వాసవీక్లబ్ నిర్వహించిన సద్భావనగోష్టి కార్యక్రమంలో పాల్గొన్న వారు మాట్లాడుతూ, కొద్ది రోజులు పోతే ఉద్యమం దానంతట అదే తగ్గిపోతుందన్నారు. తెలుగు ప్రజల మధ్య సామరస్యం దెబ్బతినకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని టీజేఏసీ నేతలకు హితవు పలికారు. వారు రెచ్చగొట్టినా సంయమనం పాటించాలని సూచించారు. వంద శాతం రాష్ట్ర ఏర్పాటు తథ్యమని అన్నారు. ప్రజలమధ్య విద్వేషాలు రగల్చడంలో రాజకీయనాయకులే ప్రధమ పాత్ర పోషిస్తున్నారని వారు ఆరోపించారు. అన్ని విధాలుగా ఆలోచించిన తరువాతే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకుందని అన్నారు.

  • Loading...

More Telugu News