: నైజీరియాలో 44 మందిని కాల్చేసిన ఉగ్రవాదులు
నైజీరియాలోని ఈశాన్యప్రాంతంలో బోకోహరం ఉగ్రవాదులు జరిపిన దాడిలో 44 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువ మంది ఆ దేశ భద్రతా బలగాలకు చెందినవారు. పాశ్చాత్యీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న బోకోహరంకు ఆ దేశంలోని అతివాద వర్గాల నుంచి మద్దతు లభిస్తుంది. దీంతో నైజీరియాలో బోకోహరం ఉగ్రవాదులు పేట్రేగిపోతున్నారు.