: పీఫా వరల్డ్ కప్ బ్రెజిల్ గెలుచుకుంటుంది: మారడోనా
వచ్చే ఏడాది బ్రెజిల్ లో జరుగనున్న పీఫా వరల్డ్ కప్ ను బ్రెజిల్ జట్టు గెలుచుకుంటుందని ఫుట్ బాల్ దిగ్గజం డీగో మారడోనా తెలిపారు. బ్యూనస్ ఎయిర్స్ లో ఆయన మాట్లాడుతూ యూరోపియన్ దేశాలు అంతగా ప్రభావం చూపలేవని అన్నారు. దీంతో బ్రెజిల్ గెలవడం లాంఛనమేనని మారడోనా జోస్యం చెప్పారు. జూన్ 12 నుంచి జూలై 13 వరకు జరిగే ప్రపంచకప్ లో సాటిరాగల దేశాలే లేవని తెలిపారు.