: 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభకు లక్షమంది హాజరవుతారు: అశోక్ బాబు


'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభకు ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు గోడపత్రిక విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభకు లక్షకు పైగా ఆంధ్రులు హాజరవుతారని అంచనా వేస్తున్నామన్నారు. హైదరాబాద్ లోని వివిధ కాలనీల వాసులు, జంటనగరాల ప్రజలు, ఉద్యోగులు సభపట్ల ఆసక్తిగా ఉన్నారని ఆయన తెలిపారు. సభకు వచ్చే ఉద్యోగుల నుంచి సభ నిర్వహణకు 10 రూపాయల చొప్పున వసూలు చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు. జెండాలు, అజెండాలు ప్రక్కనపెట్టి సమైక్యాంధ్రే లక్ష్యంగా వచ్చే రాజకీయ నాయకులందర్నీ కలుపుకుపోతామని అశోక్ బాబు స్పష్టం చేశారు. సభకు అనుమతినిచ్చే విషయంలో ప్రభుత్వం తొందరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. అనుమతి నిరాకరిస్తే కోర్టుకెళ్తామని అశోక్ బాబు తెలిపారు.

  • Loading...

More Telugu News