: హైదరాబాద్ కు ప్రపంచపటంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చింది మేమే: చంద్రబాబు


తెలుగువాడి ఆత్మగౌరవాన్ని చాటింది ఎన్టీఆర్ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా పొందుగులలో తెలుగుజాతి ఆత్మగౌరవ యాత్ర చేపట్టిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొమ్మిదేళ్ల పాలనలో హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది తామేనన్నారు. గతంలో ఎన్జీయే అధికారంలో ఉండగా హైదరాబాద్ తెలంగాణలోనే ఉంది కనుక, ప్రత్యేక రాష్ట్రం అవసరం లేదని అప్పటి బీజీపీ అధ్యక్షుడు అద్వానీ అన్నారని తెలిపారు. విభజన చిచ్చుకు ఆద్యుడు వైఎస్సేనని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ అంటే కాంగ్రెస్ తాత జాగీరులా వ్యవహరిస్తోందని మండి పడ్డారు. టీఆర్ఎస్, వైఎస్సార్ సీపీల అండతోనే కాంగ్రెస్ పార్టీ దుర్మార్గపు రాజకీయాలు చేస్తుందని విమర్శించారు.

తెలుగు ప్రజల మధ్య గొడవలు పెట్టింది సోనియా అయితే, విభజన చిచ్చుకు ఆజ్యం పోసింది వైఎస్సేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని పతనం దిశగా తీసుకెళ్లింది యూపీఏ ప్రభుత్వమేనని బాబు దుయ్యబట్టారు. రూపాయి పతనమైపోతోంది, ధరలు అదుపు చేయలేకపోతున్నారు. పరిపాలన చేతకాకపోతే ప్రధాని తక్షణం గద్దె దిగాలని డిమాండ్ చేశారు. తమకు అధికారం ఇస్తే ఆరు నెలల్లో సమస్యలన్నీ పరిష్కరిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.

గతంలో టీడీపీ బలపరిచిన ప్రభుత్వాలే అధికారంలోకి వచ్చాయని గుర్తు చేశారు. దానిని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ దుర్మార్గపు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. కేసులు మాఫీ చేయడానికి రాష్ట్రాన్ని తాకట్టు పెడతారా? అని వైఎస్సార్ సీపీని సూటిగా ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీని అండగా చేసుకుని రాజకీయాలు చేసేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోందని ఆయన ఆరోపించారు. గతంలో టీడీపీ తెలంగాణ సమస్యను పరిష్కరించాలని చెప్పిన మాట వాస్తవమేనని ఆయన ఒప్పుకున్నారు. అయితే విభజన అనేటప్పుడు పలు అంశాలను శాస్రీయంగా పరిగణనలోకి తీసుకోవాలని హితవు పలికారు.

టీఆర్ఎస్ కు ప్యాకేజీలు కావాలి, వైఎస్సార్సీపీకి బెయిళ్లు కావాలని విమర్శించారు. వైఎస్సార్ సీపీకి, సోనియాకు హాట్ లైన్ ఉందని ఆయన తెలిపారు. అందుకే వైఎస్ ముఖం పెట్టుకుని కాంగ్రెస్ మీ ముందుకు వస్తోందని ఆయన స్పష్టం చేశారు. సంపద, ఉద్యోగాలు హైదరాబాద్ లో కల్పించింది తామేనని బాబు అన్నారు. 'హైదరాబాద్ రావద్దు, అక్కడ మీకు ఉద్యోగాలు రావు' అంటే ఎవరికైనా కోపమొస్తుందని చంద్రబాబు నాయుడు అన్నారు. మీ సమస్యలు పరిష్కారమయ్యేవరకు మీకు అండగా ఉంటానన్నారు.

  • Loading...

More Telugu News