: చంద్రబాబును ప్రజలు, ఉద్యోగులు, టీడీపీ నేతలే నిలదీయాలి: అంబటి


ఆత్మగౌరవ యాత్ర పేరిట యాత్ర చేపట్టిన టీడీపీ అధినేత చంద్రబాబును ప్రజలు, ఉద్యోగులు, టీడీపీ నేతలే నిలదీయాలని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పిలుపునిచ్చారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ ప్రజలంతా సమైక్యాంధ్ర అంటూ ఉద్యమంలో పాల్గొని ఉద్యమాన్ని హోరెత్తిస్తుంటే, ఆ ఉద్యమానికి మద్దతు పలకకుండా బాబు ఎలా యాత్ర చేస్తాడంటూ ప్రశ్నించారు. ఆత్మగౌరవ యాత్ర పేరిట యాత్ర చేసే నైతిక హక్కు బాబుకు లేదని ఆయన స్పష్టం చేశారు. సీమాంధ్ర గడ్డపై కాలు పెట్టాలంటే ముందుగా తాను సమైక్యవాదినని రుజువు చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో బాబుకు ఉద్యమకారులే బుద్ధి చెబుతారని అంబటి రాంబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News