: సమైక్యాంధ్రకు మద్దతుగా వినూత్న నిరసన


రాష్ట్ర విభజనను నిరసిస్తూ అనంతపురంలో సమైక్యవాదులు వినూత్న నిరసన చేపట్టారు. గత నెల రోజుల్లో జరిగిన ఆందోళనల్లో ధ్వంసమైన డివైడర్లను 'అవే' సంస్థ ఆధ్వర్యంలో ప్రజలే పునరుద్ధరిస్తున్నారు. ప్రజల సహాయంతో డివైడర్లను యథావిధిగా నిర్మించే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. డివైడర్లను నిర్మించి, వాటికి రంగులు వేసి సమైక్య నినాదాలతో పాటు, రాష్ట్ర విభజన వల్ల జరిగే నష్టాలను వాటిపై రాయనున్నారు. ఈ పనులన్నీ సమైక్యవాదులే చేపట్టడం విశేషం. మరో వైపు నిరసన ర్యాలీలు, రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక నేత కొగటం విజయభాస్కరరెడ్డి చేస్తున్న నిరవధిక దీక్ష మూడో రోజుకు చేరుకుంది.

  • Loading...

More Telugu News