: ఈపీడీసీఎల్ సీఎండీగా బాధ్యతలు స్వీకరించిన శేషగిరిబాబు
ఈపీడీసీఎల్ సీఎండీగా ఎంవీ శేషగిరిబాబు ఆదివారం ఉదయం పదవీబాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్ లో భూభారతి రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టెర్ గా పనిచేసిన ఆయన, బదిలీపై విశాఖ ఈపీడీసీఎల్ సీఎండీగా నియమితులయ్యారు. గతంలో ఆయన విశాఖలో భూసేకరణ విభాగంలో ప్రత్యేక ఉపకలెక్టర్ గా, పశ్చిమగోదావరి జిల్లా అసిస్టెంట్ జాయింట్ కలెక్టర్ గా పని చేశారు.