: సైకిలెక్కిన సీపీఎం ఎమ్మెల్యే జూలకంటి
సీపీఎం ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి సైకిలెక్కారు. అదేంటి అవాక్కయ్యారా? ఆయన పార్టీ మారలేదులెండి .. పెరిగిన పెట్రోలు ధరలకు వ్యతిరేకంగా సైకిల్ తొక్కుతూ ఆయన నిరసన తెలిపారు. హైదరాబాద్ లో ఈ విధంగా నిరసన తెలిపిన జూలకంటి, పెంచిన పెట్రోలు ధరను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్రం అసమర్థ విధానాల వల్లే రూపాయి పతనమై ధరలు పెరిగిపోతున్నాయని, వ్యవసాయాధారిత దేశమైన మన దేశంలోనే ఉల్లిపాయలు దొరకడం లేదని మండిపడ్డారు. పరిపాలన చేతకానప్పుడు అధికారంలో కొనసాగడంలో అర్ధం లేదని కాంగ్రెస్ పార్టీని ఆయన ఎద్దేవా చేశారు.