: 'గాలి' బెయిల్ కుంభకోణం కేసులో నిందితులకు సుప్రీంకోర్టు నోటీసులు
కర్ణాటక ఎంపి గాలి జనార్థన్ రెడ్డి బెయిల్ కుంభకోణం కేసులో నిందితులకు సుప్రీంకోర్టు నోటీసులు పంపింది. ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన గాలి జనార్థన్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు సోమశేఖరరెడ్డి, ఏసీబీ కోర్టు న్యాయమూర్తి పట్టాభిరామారావులకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల్లో సమాధానం ఇవ్వాలని కోర్టు వారిని ఆదేశించింది.
డబ్బిచ్చి బెయిల్ పొందేందుకు ప్రయత్నించిన ఈ కేసులో మొత్తం ఎనిమిది మంది నిందితులకూ బెయిల్ మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ అవినీతి నిరోధక శాఖ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో నిందితులయిన దశరథరామిరెడ్డి, ప్రభాకర్ రావు, లక్ష్మీ నరసింహారావు, కంప్లి ఎమ్మెల్యే సురేష్ బాబు ల బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన ఎస్ఎల్పీలను కోర్టు కొట్టివేసింది.
ఏసీబీ కోర్టు న్యాయమూర్తి పట్టాభిరామారావుకు చెందిన బ్యాంకు లాకర్లలో 2.72 కోట్ల రూపాయల అక్రమ సంపాదనను ఏసీబీ.. సుప్రీంకోర్టు దృష్టికి తీసుకు వచ్చింది.
ఏసీబీ కోర్టు న్యాయమూర్తి పట్టాభిరామారావుకు చెందిన బ్యాంకు లాకర్లలో 2.72 కోట్ల రూపాయల అక్రమ సంపాదనను ఏసీబీ.. సుప్రీంకోర్టు దృష్టికి తీసుకు వచ్చింది.