: ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లడమే మంచిది: సోమిరెడ్డి
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల్లో మిగిలింది, ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లటమేనని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో 9 కోట్ల మందికి పరిపాలన అందించాల్సిన సచివాలయంలో వీధిపోరాటాలు జరుగుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తుండడం దురదృష్టమన్నారు. సోనియాగాంధీ శాడిస్టులా వ్యవహరిస్తుండగా, దిగ్విజయ్ వ్యాఖ్యలు పుండుమీద కారం చల్లినట్టు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి పునర్వైభవం తీసుకువచ్చి అభివృద్ధిపథంలో నడిపే నేత ఎవరో ప్రజలే గుర్తించి ఎంపిక చేసుకోవాలని ఆయన సూచించారు.