: చంద్రబాబుకు లగడపాటి లేఖ
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ లేఖ రాశారు. 2008లో తెలంగాణకు అనుకూలంగా బాబు లేఖ రాసినప్పుడే అది తెలుగు ప్రజల హృదయాలను కలచివేసిందన్నారు. బాబు తెలుగు ప్రజలకు ద్రోహం చేశారని విమర్శించారు. తన లేఖ ద్వారానైనా బాబు మనసు మార్చుకోవాలని చెప్పారు. ఆత్మ ప్రబోధంతో మంచి నిర్ణయం తీసుకోవాలన్నారు. బాబు చేపడుతోంది తెలుగు ప్రజల ఆత్మగౌరవ యాత్ర కాదని, అది ఆత్మ ఘోష యాత్ర అని ఆగ్రహం వ్యక్తం చేశారు.