: ఆలయం వద్ద అడ్డుగా విప్ వాహనం.. భక్తుల ఇబ్బందులు


ప్రజాప్రతినిధుల వ్యవహారశైలికి నిదర్శనమైన ఘటన శ్రీశైలంలో చోటుచేసుకుంది. తాము అధికార పార్టీకి చెందిన వారమైతే దేవుడైనా తాము చెప్పినట్టు వినాల్సిందే అన్న తీరుగా ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి వ్యవహారం ఉందని స్థానికులు మండిపడుతున్నారు. శ్రీశైలం మల్లికార్జునస్వామి ఆలయం ముఖద్వారానికి అడ్డంగా గండ్ర తన వాహనాన్ని రెండు గంటలకుపైగా నిలపడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆయనకు చెందిన రెండు వాహనాలను ఆలయద్వారానికి అడ్డుగా నిలపడడంతో భక్తులు స్వామి వారి దర్శనానికి వెళ్లలేకపోయారు. దీంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తుల ఫిర్యాదుతో అక్కడికి చేరుకున్న ఈవో సెక్యూరిటీని మందలించారు. అయినప్పటికీ సదరు డ్రైవర్ వాహనాన్ని తీయకుండా నిర్లక్ష్యం ప్రదర్శించడంతో భక్తులు మండిపడుతున్నారు. దీంతో ప్రజాప్రతినిధా? మజాకా..? అని కొందరు ముక్కున వేలేసుకుంటున్నారు.

  • Loading...

More Telugu News