: ప్రధాని అభ్యర్ధిని ప్రకటించండి: పార్టీకి అరుణ్ జైట్లీ విజ్ఞప్తి
2014 సార్వత్రిక ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్ధిని ప్రకటించాలని ఆ పార్టీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై పార్టీలో నేతల మధ్య ఎలాంటి అపోహలు, విభేదాలు లేవన్నారు. ముందస్తు నిర్ణయం వల్ల రాజకీయంగా లబ్ది పొందే అవకాశం ఉందని సూచించారు. పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన జైట్లీ.. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ప్రధాని అభ్యర్ధి కావచ్చని చూచాయగా తెలిపారు. గతనెలలో ఈ విషయంపైనే బీజేపీ, ఆర్ఎస్ఎస్ తో చర్చ జరిపి ఓ నిర్ణయం తీసుకుంది. అయితే, సమయాన్ని బట్టి పార్టీ ప్రధాని అభ్యర్ధిని ప్రకటించాలన్న ఆలోచనలో ఉంది.