: కేవీపీ నివాసంలో సీమాంధ్ర మంత్రుల భేటీ


రాజ్యసభ సభ్యుడు కేవీపీ నివాసంలో సీమాంధ్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, రఘువీరా రెడ్డి, వట్టి వసంతకుమార్ లు సమావేశమయ్యారు. ఢిల్లీ పరిణామాలపై నేతలు చర్చించారు. మంగళవారం కేంద్రమంత్రులు, ఎంపీలు మరోసారి సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నామని మంత్రులకు ఆయన చెప్పినట్టు సమాచారం. ఇప్పటికే సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు రాజీనామాలకు సూచనప్రాయంగా అంగీకారం తెలిపిన సంగతి తెలిసిందే. మరో వైపు ఎపీఎన్జీవోలు హైదరాబాద్ లో సభకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. సీమాంధ్రలో ఉద్యమం రోజు రోజుకీ తీవ్ర రూపం దాలుస్తోందే తప్ప సెగలు చల్లారడం లేదు. ఈ పరిస్థితుల్లో కేంద్రంలోని సీమాంధ్రకు చెందిన నేతలు స్పష్టమైన నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి నెలకొంది.

  • Loading...

More Telugu News