: అత్యాచారాలను నిరోధించేందుకు ఫ్యాషన్ ఉపకరణాలు
ఢిల్లీ సామూహిక అత్యాచారం అనంతరం దేశంలో ఇలాంటివే అనేక ఘటనలు పెరిగిపోతున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఇలాంటి అకృత్యాల నుంచి మహిళలు తమను తాము కాపాడుకునేందుకు అనేకమంది విద్యార్ధులు కొత్త ఆలోచనలు చేశారు. ఇదే నేపథ్యంలో అహ్మదాబాద్ లో ఓ ప్రైవేటు సంస్థ వినూత్న ఫ్యాషన్ దుస్తులను రూపొందించింది. వీటిని మహిళలు ధరిస్తే ప్రమాదాల సమయంలో తమను రక్షించుకోవచ్చని చెబుతున్నారు.
ఈ నూతన ఆలోచనల వెనుక 'నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్'(ఎన్ఐఎఫ్, ఐఐఎమ్ ఆధ్వర్యంలోని ఎస్ఆర్ఐఎస్ టీఐ (సొసైటీ ఫర్ రీసెర్చ్ అండ్ ఇన్షియేటివ్స్ ఫర్ సస్టైయినబుల్ టెక్నాలజీస్ అండ్ ఇన్ స్టిట్యూషన్స్) ఉంది. డబ్బు కోసం కాకుండా సమాజంలో జరుగుతున్న అత్యాచార ఘటనలను దృష్టిలో పెట్టుకునే ఈ ఫ్యాషన్ ఉపకరణాలను తయారుచేశామంటున్నారు. ఈ సరికొత్త ఆలోచన దేశంలో మహిళలపై చోటు చేసుకుంటున్న ఘటనలను నిరోధించడంలో ఉపయోగపడుతుందని ఎన్ఐఎఫ్ డైరెక్టర్ డాక్టర్ విపిన్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు.