: జగన్ సతీమణిని అనుమతించండి: కోర్టు


నిమ్స్ లో దీక్ష కొనసాగిస్తున్న జగన్ ను కలిసేందుకు ఎట్టకేలకు ఆయన భార్య భారతికి అనుమతి లభించింది. నిన్న ఉస్మానియా ఆసుపత్రిలో దీక్ష కొనసాగిస్తున్న జగన్ వెంట విజయమ్మ, భారతి ఉండేందుకు అనుమతించాలని జగన్ తరుపు న్యాయవాది సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. వెనువెంటనే మరోసారి మెమో పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు నిర్ణయాన్ని నేటికి వాయిదా వేసింది. ఈ ఉదయం ఆ పిటిషన్ పై నిర్ణయాన్ని వెలువరిస్తూ, భారతి తీసుకువచ్చే ఆహారాన్ని, మందులను నిమ్స్ లోకి చంచల్ గూడ జైలు అధికారులు అనుమతించాలని కోర్టు పేర్కొంది.

జగన్ నిమ్స్ నుంచి డిశ్చార్జి అయ్యేవరకు భారతిని ఆసుపత్రిలోకి అనుమతించాలని న్యాయస్థానం ఆదేశించింది. అయితే, ఆమె ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4 గంటలవరకే జగన్ ను కలవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కాగా, ఉస్మానియా నుంచి నిన్న రాత్రి బాగా పొద్దుపోయాక జగన్ ను నిమ్స్ కు తరలించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News