: 'ఐబీఎన్7 జర్నలిస్టుల'పై ఆశారామ్ బాపు అనుచరుల దాడి


రాజస్థాన్ లోని జోధ్ పూర్ నగరంలో 'ఐబీఎన్7' పత్రికా విలేకరి, కెమెరా మెన్ పై ఆధ్యాత్మిక గురువు ఆశారామ్ బాపు అనుచరులు ఈ ఉదయం దాడి చేశారు. ఇద్దరికీ తీవ్రగాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ దాడిలో కెమెరా ముక్కలుకాగా, ఓబీ వ్యాన్ ధ్వంసమైంది. మైనర్ బాలికపై లైంగిక దాడికేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆశారామ్ ఆశ్రమం బయట రిపోర్టింగ్ చేస్తున్న జర్నలిస్టులపై దాడికి పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. దాడి సమయంలో పోలీసులు లేకపోవడంతో స్థానికులే వారిని రక్షించారు. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి మనీష్ తివారీ ఈ దాడిని ఖండించారు. మరోవైపు, లైంగిక దాడి ఆరోపణల కేసులో నోటీసులు అందుకున్న ఆశారామ్ నిన్న పోలీసుల ఎదుట విచారణకు హాజరుకాలేదు.

  • Loading...

More Telugu News