: శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా: లగడపాటి
నాగార్జున విశ్వవిద్యాలయంలో విద్యార్ధి జేఏసీ, సమైక్యవాదులు అడ్డుకున్న అనంతరం ఎంపీ లగడపాటి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర సమైక్యత కోసం ఎంపీలు పార్లమెంటులో ఆందోళన చేస్తున్నారని వివరణ ఇచ్చారు. రాష్ట్రం సమైక్యంగా ఉండని పక్షంలో శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. సమైక్యంగా ఉంచాలన్న నినాదంతో పార్లమెంటును స్తంభింపజేస్తున్నామన్న ఆయన, సభ్యులను సస్పెండ్ చేసినా వారు సమావేశాలను అడ్డుకుంటున్నారని చెప్పారు. మంత్రులు రాజీనామాలకు సిద్ధంగానే ఉన్నారని, రాజీనామాలు ఆమోదింపజేసుకుని ప్రజల్లోకి రావడం కష్టమేమీ కాదన్నారు. పార్లమెంటులో వాణి గట్టిగా వినిపించకపోతే బిల్లు ఆమోదానికి వేర్పాటువాదులకు అవకాశం ఉంటుందన్నారు.