: సహరా అభ్యర్థనను తిరస్కరించిన సుప్రీంకోర్టు
డిపాజిటర్లకు 24 వేల కోట్ల రూపాయలను తిరిగి చెల్లించేందుకు మరికొంత వ్యవధి కోరుతూ సహరా సంస్థ చేసుకున్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇప్పటికే నవంబరులో చెల్లించాల్సిన సొమ్మును ఫిబ్రవరి మొదటి వారం లోపు చెల్లించాలని సహరా సంస్థకు చెందిన రెండు కంపెనీలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అల్తమాస్ కబీర్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. మరోసారి సహరా సంస్థ వ్యవధి కోరడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. డిపాజిటర్లకు డబ్బు తిరిగి చెల్లించని పక్షంలో న్యాయస్థానం వద్దకు రావల్సిన అవసరం లేదని సహరా సంస్థకు సూచించింది.