: టెలికాం నయా నిబంధనలతో ఇంటర్నెట్ ధరలకు రెక్కలు!
త్వరలో ఇంటర్నెట్ ధరలు పెరగనున్నాయా? వరస చూస్తుంటే నిజమేననిపిస్తోంది. టెలికాం లైసెన్సుల ఒప్పందానికి టెలికాం శాఖ తాజా సవరణ చేసింది. దాంతో, ఇంటర్నెట్ వినియోగం భారంగా మారనుందట. దాదాపు 30 శాతం మేర పెరిగే అవకాశం ఉందట. ఈ నెల 2న టెలికాం శాఖ జారీ చేసిన 'యూనిఫైడ్ లైసెన్స్' ప్రకారం సర్ధుబాటు స్థూల ఆదాయం (ఏజీఆర్) నుంచి ఇంటర్నెట్ సేవల ఆదాయానికి మినహాయింపు లభించింది. నిన్న టెలికాం శాఖ తాజాగా విడుదల చేసిన సవరణలో ఏజీఆర్ లెక్కింపులో ఇంటర్నెట్ సేవల ఆదాయాన్ని కూడా పరిగణిస్తామని పేర్కొంది. దీనివల్ల నెట్ వినియోగదారులపై 30 శాతం అదనపు భారం పడుతుందని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అసోసియేషన్ తెలిపింది.