: రెండో భాష నేర్వడంలో పసివారి మెదడుకు బలం


పసిపిల్లల్లో సహజంగానే గ్రాహ్యశక్తి చాలా అధికంగా ఉంటుంది. ఒక కొత్త విషయాన్ని నేర్పినప్పుడు పెద్దవారికంటె పసివారికి తొందరగా వస్తుందనేది ఒక స్టడీ. భాషలు నేర్చుకోవడంలో కూడా ఇదే సిద్ధాంతం వర్తిస్తుంది. కొత్తభాషను పిల్లలు నేర్చుకున్నంత సులువుగా పెద్దలు నేర్చుకోలేరుట. అయితే ఇక్కడ కెనడాలోని కొందరు శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలు.. పిల్లలకు రెండో భాష నేర్పడానికి పుట్టిన కొన్నేళ్ల తర్వాత ప్రయత్నిస్తే.. అది వారి మెదడు మరింత బాగా పనిచేయడానికి దారితీస్తుందని అంటున్నారు.

మరీ శిశువులకు కాకుండా కొన్నేళ్ల వయసులో రెండోభాష నేర్పడం మొదలెడితే.. వారి మేధోశక్తి కూడా పెరుగుతుందని కెనడా మాంట్రియల్‌లోని న్యూరోలాజికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ అండ్‌ హాస్పిటల్‌, మెక్‌గిల్‌ యూనివర్సిటీ లోని ది న్యూరో, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ వారు కలిసి చేసిన పరిశోధనల్లో తేలింది. రెండు భాషలు, ఒక్క భాష నేర్చిన పిల్లల మెదడులు ఎంఆర్‌ఐ స్కానింగ్‌ తీసి వారు ఈ సంగతి తెలుసుకున్నారు. ఓ సరికొత్త సాఫ్ట్‌వేర్‌ను విశ్లేషణకు వాడారు. మొదట మాతృభాష, తర్వాత కొన్నేళ్లకు రెండో భాష నేర్చుకున్న పసివారికి మెదడులో ఇన్ఫీరియర్‌ ఫ్రంటల్‌ కార్టెక్స్‌ గట్టిపడుతోందిట. ఈ తరహా నిర్మాణం.. పిల్లల్లో సామర్థ్యాన్ని పెంచుతుందని వారి అధ్యయనం తేల్చింది.

  • Loading...

More Telugu News