: రసం తీస్తే విషం అవుతుంది!


'మొక్కే కదా అని పీకేస్తే.. పీక కోస్తా' అనే చిరంజీవి డైలాగు మీకు గుర్తుందా? అభిమానులకైతే మహబాగా గుర్తుంటుంది. అచ్చం అలాగే 'పండే కదా అని పిండేస్తే' అది కాస్తా విషంలాగా మారి.. ఆరోగ్యాన్ని హరిస్తుంది. విషం అంటే అచ్చంగా విషం కాదు గానీ.. అది కలిగించే చక్కెర వ్యాధితో పోలిస్తే అంతకంటె తక్కువేం కాదు. ఇంతకూ విషయం ఏంటంటే... పండ్లు ఆరోగ్యానికి మంచివని మనం విచ్చలవిడిగా తీసుకుంటూ ఉంటాం. అయితే అవి కూడా తియ్యగా ఉంటాయి కదాని చక్కెర వ్యాధి గ్రస్తులు, ఆ వ్యాధికి సంబంధించిన భయం ఉన్నవారు కాస్త దూరంగా ఉండడం సహజం.

కానీ నిజానికి ద్రాక్ష, యాపిల్‌ వంటి పండ్లను నేరుగా తినేస్తే మధుమేహం సోకే ప్రభావం తక్కువట. అయితే అదే పండ్లను పిండుకుని రసంగా మార్చి తీసుకుంటే మాత్రం.. జబ్బు సోకే ప్రమాదం పెరుగుతుందిట. నేరుగా పండ్లనైతే ఎంత ఎక్కువ తిన్నా మంచిదేనట. టైప్‌-2 మధుమేహం మన దరికి రాదని వాషింగ్టన్‌ లో జరిగిన అధ్యయనం నిగ్గు తేలుస్తోంది. పీచ్‌, స్ట్రాబెర్రీ, నారింజ, ప్లం, కిస్‌మిస్‌ వంటి అనేక పండ్లపై పరిశోధన చేసి.. పిండకుండా ఉండినంత వరకు పండు మనకు ఫ్రెండే అని తేల్చారు శాస్త్రవేత్తలు.

  • Loading...

More Telugu News